
ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అద్భుతమైన జుగాడ్ తయారు చేసాడు. ఏకంగా తన డబుల్‌కాట్ మంచాన్ని కారుగా మార్చేశాడు. ఇతని కారు ఒకటి షెడ్లో పనికిరాకుండా ఉంది.. అది పాతమోడల్ కాస్త ఓల్డ్ లుక్‌లో ఉండటంతో దానికి సరికొత్త రూపాన్ని ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంట్లోని బెడ్‌ను తీసుకొచ్చి అతని పాత కారుకు అమర్చాడు. తల పెట్టే వైపు డ్రైవింగ్ సీట్ అమర్చాడు. కాళ్ల వైపు రెండు అద్దాలను పెట్టాడు. అంతేకాదు రోడ్డుపై దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. రోడ్డుమీద మిగతా వాహనదారులు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. బ్రో.. నీ క్రియేటివిటీకి సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోల కోసం
సింహంతో బాలుడి పరాచకాలు.. వీడియో
భూదేవి చెప్పిందంటూ.. సజీవ సమాధికి యత్నించిన వ్యక్తి చివరికి వీడియో
పర్యాటకులకు కనిపించిన అద్భుతం.. పులి ఏం చేసిందంటే?
కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ