
పొటాషియం, ఫాస్పరస్ అధికమోతాదులో ఉండే గ్రేప్స్ తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని అక్కర్లేని సోడియంను మూత్రం ద్వారా అవి బయటకు పంపిస్తాయి. తద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అరటిపండులోనూ పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. 1600 మందిపై నిర్వహించిన అధ్యయనాల్లో పొటాషియం ఎక్కువగా తీసుకున్నవారిలో బీపీ అదుపులో ఉందని తేలింది. అందుకే రక్తపోటును అదుపులో ఉంచడంలో అరటిపళ్లుకూడా బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. అధిక రక్తపోటుతో బాధపడేవారు తమ ఆహారంలో పచ్చి ఉల్లిపాయలు చేర్చుకోవాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే అడెనోసిన్ అనే రసాయనం వల్ల కండరాలు రిలాక్స్ అవడమే కాకుండా బీపీ అదుపులోకి వస్తుంది. కొబ్బరి నీళ్లలో కాల్షియం, విటమిన్ సితోపాటు మరెన్నో మినరల్స్ ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం బీపీని అదుపులోకి తీసుకొచ్చేందుకు తోడ్పడుతుంది. బీపీని అదుపులో ఉంచే మరో మంచి ఔషధఫలం పుచ్చకాయ. ఇందులో ఉండే అమైనో ఆసిడ్లు రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. తరచూ పుచ్చకాయను తీసుకోవడం వలన మెదడులో రక్తం గడ్డకట్టడం, గుండెపోటువంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్య రీల్స్ సరదా.. పాపం భర్త ఉద్యోగానికి ఎసరు
పిడకల యుద్ధం..! ఎన్నో ఏళ్ల వింత ఆచారం..
ఒక టీ 65 వేలు, నీళ్ల బాటిల్ 50 వేలు.. ఆ రెస్టారెంట్ బిల్లుతో పట్టపగలే చుక్కలు
Naa Anveshana: సిరి హన్మంతు గుట్టు రట్టు చేసిన అన్వేష్
స్వీట్ వాయిస్ కోసం పాము వీర్యం తాగుతున్న సింగర్…