
చిత్ర పరిశ్రమలో ఏ హీరో అయినా సరే వచ్చిన కథనే ఒకే చేయరు. రెండు మూడు కథలు విని అందులో తమకు నచ్చినవి సెలక్ట్ చేసుకుంటారు. ఇక ఒక హీరో రిజక్ట్ చేసిన సినిమా కథను మరొకరు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారు. అయితే అలానే సూర్య రిజక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆశ సినిమా అందరికీ తెలిసిందే. హీరో అజిత్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇదొకటి. కాగా, ఈ మూవీని ముందుగా డైరెక్టర్ వసంత్, సూర్యతో తీయాలనుకున్నారంట. కానీ హీరో రిజక్ట్ చేయడంతో అజిత్ ఈ సినిమాలో నటించారు.
విజయ్ దళపతి నటించిన సినిమాల్లో తుపాకి ఒకటి. ఈ సినిమా హీరో విజయ్‌కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. కాగా, ఈ సినిమాలో సూర్యనటించాల్సి ఉండేనంట. కానీ కొన్ని కారణాల వలన మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ సినిమాను ముందుగా డైరెక్టర్ సూర్యను అప్రోచ్ అవ్వగా, తాను ఈ కథకు సెట్ అవుతానో లేదో అని దీనిని సింపుల్‌గా రిజెక్ట్ చేశాడంట.
అలాగే కార్తిక్ సూపర్ హిట్ మూవీలో పరుత్తివీరన్ ఒకటి. ఈ సినిమాను కూడా సూర్య రిజక్ట్ చేశాడంట. కథ తమ్ముడికి సెట్ అవుతుందని భావించి, సూర్య ఈ సినిమా వదులుకున్నాడు.