

ముఖంపై ఎక్కువగా కనిపించే అవాంఛిత వెంట్రుకలు చాలా మంది మహిళలకు ఒక ప్రధాన సమస్యగా మారింది. వీటి వల్ల ముఖం అందాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే చాలా మంది పార్లర్లలో థ్రెడ్డింగ్, వాక్సింగ్, షేవింగ్ లాంటి చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ నొప్పితో కూడుకున్న విధానాలే. అయితే ఇంట్లోనే సహజమైన పదార్థాలతో ఈ సమస్యను తొలగించుకోవచ్చు. ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే ఫేషియల్ హెయిర్ పూర్తిగా పోతాయి.
పసుపు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. పసుపును ముఖానికి అప్లై చేస్తే అవాంఛిత రోమాల వృద్ధిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే దీని ప్రభావాన్ని మరింత మెరుగుపరిచేందుకు నెయ్యితో కలిపి ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు.
పసుపును నెయ్యితో కలిపి ముఖానికి రాస్తే చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా వెంట్రుకల వృద్ధిని తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని నయం చేస్తాయి. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, పోషకాల వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- ముఖంపై ఉండే ధూళి, కాలుష్యాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
- చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చుతుంది.
- ఫైన్ లైన్స్, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది.
- డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ తొలగించడంలో సహాయపడుతుంది.
- చర్మాన్ని హైడ్రేట్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.
- మొటిమలు రాకుండా నిరోధిస్తుంది.
- ముఖంపై వెంట్రుకల వృద్ధిని తగ్గిస్తుంది.
మూడు టీ స్పూన్లు నెయ్యి తీసుకుని అందులో ఒక టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు పొడి కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖంపై అప్లై చేయండి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇప్పుడు నెమ్మదిగా స్క్రబ్ చేసుకుంటూ నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
ఇలా చేయడం వల్ల ముఖంపై వెంట్రుకలు క్రమంగా తగ్గిపోతాయి. ముఖం మృదువుగా మారడమే కాకుండా సహజ మెరుపు కూడా పొందుతుంది. సహజమైన విధానాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. అందుకే పార్లర్ లకు వెళ్లకుండా ఇంట్లోనే ఇలా చేసి చూడండి.
ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ మిశ్రమాన్ని ముఖానికి ఉపయోగించే ముందు.. ముందుగా చేతి మీద చిన్న భాగంలో రాసి పరీక్షించాలి. ఎలాంటి అలర్జీ, అసౌకర్యం లేకుంటే పూర్తిగా ముఖానికి అప్లై చేయండి.