
ఢిల్లీ సరహద్దుల్లో ఎన్నో ప్రయాసలకు ఓర్చి రైతులు చేసిన ఆందోళనలే తాము పంట పొలాల్లో పెళ్లి చేసుకోవడానికి కారణమని ఆ జంట తెలిపింది. అంతకుముందు వధువు హర్మన్ కౌర్ భారీ ఊరేగింపుతో వరుడు దుర్లభ్ ఇంటికి చేరింది. తర్వాత అక్కడి నుంచి ఊరి బయట పొలాల్లో ఏర్పాటు చేసిన పెళ్లి మండపానికి వచ్చింది. ఆ తర్వాత బంధుమిత్రుల సమక్షంలో వధూవరులు ఒక్కటయ్యారు. పెళ్లిమండపాన్ని రకరకాల మొక్కలతో అలంకరించారు. పెళ్లి అనంతరం వాటిని చుట్టాలకు పంచారు. అదేవిధంగా రైతుల నినాదాలు ముద్రించిన స్వీట్ బాక్సులను పంచిపెట్టారు. రైతులు ఉత్పత్తి చేసిన తేనె సీసాలను అందజేశారు. ఈ పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైతుల ఆందోళనలను ఆదర్శంగా తీసుకుని పంట పొలాల్లో పెళ్లి చేసుకున్న యువ జంటన అభినందిస్తున్నారు. దుర్లబ్ సింగ్, హర్మన్ కౌర్లు ప్రస్తుతం కెనడాలో సాఫ్టవేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో