
వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. పేరుకు తగ్గట్లుగానే ఈ ఘోస్ట్ మ్యారేజీల్లో ప్రేతాత్మలకు పెళ్లిళ్లు చేస్తారు. పెళ్లి కాకుండా చనిపోయిన యువతీ యువకులకు సాంప్రదాయబద్దంగా గ్రాండ్‌గా పెళ్లి తంతు నిర్వహిస్తారు. గతంలో శవాలకు మాత్రమే ఈ తంతు జరిపేవారు. కానీ ఇప్పుడు బతికున్నవారు తమ ప్రేయసీప్రియులు అర్థాంతరంగా చనిపోతే వారి శవాలను బయటకు తీసి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఈ ఘోస్ట్ మ్యారేజీలు ఏదో సాదా సీదాగా చేస్తారనుకుంటే పొరపాటే. నిజంగా జరిగే పెళ్లిళ్లలాగే అన్ని తంతులు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల వరుడి తరుఫు వారు వధువుకు కన్యాశుల్కం కూడా చెల్లించారు. మరికొన్ని ప్రాంతాల ఆచారం ప్రకారం పెళ్లికొడుకుకు కట్నం ఇస్తారు. పేపర్ తో తయారు చేసిన నగలు, ఫర్నీచర్, కిచెన్‌లో ఉపయోగించే వస్తువులను వరుడి తరఫువారికి అందజేస్తారు. సాధారణంగా యువతీయువకుల తల్లిదండ్రులు తమ స్థాయికి తగ్గ సంబంధాలను వెతుకుతుంటారు. ఘోస్ట్ మ్యారేజ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. తమ కుటుంబ హోదా, పలుకుబడికి తగినట్లు ఉంటేనే సంబంధం కలుపుకుంటారు. అంతేకాదు.. చైనీయులు విశ్వసించే ఫెంగ్ షూయ్ ప్రకారం వధూవరుల ఇద్దరి జాతకాలను చూస్తారు. అన్నీ కుదిరితేనే ప్రేతాత్మల పెళ్లికి డేట్ ఫిక్స్ చేస్తారు. లేదంటే మరో సంబంధం వెతికేపనిలో పడతారు.చైనీయులు చేసే దెయ్యాల పెళ్లిళ్లలో ముందుగా అమ్మాయి, అబ్బాయి తరఫు వారు ఫంక్షన్ హాళ్లలో విందు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత చనిపోయిన అమ్మాయి, అబ్బాయి సమాధులను తవ్వి వారి ఎముకలను బయటకు తీస్తారు. వారి వారి ట్రెడిషన్ ప్రకారం పెళ్లి చేసి ఆ తర్వాత ఇద్దరి ఎముకలను ఒకే సమాధిలో పాతిపెడతారు. నార్త్ చైనాలో ఈ సంప్రదాయం పాటించే వారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఈ ఘోస్ట్ మ్యారేజీల్లోనూ రెండు రకాలు ఉంటాయి. సంబంధం కుదిరిన తరువాత అమ్మాయి అబ్బాయి చనిపోతే వారి పెళ్లి చేయడం అందులో ఒక రకమైతే.. కొత్తగా సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేయడం రెండో రకం. సాధారణంగా నిశ్చితార్థం అయిన తర్వాత దురదృష్టవశాత్తూ అమ్మాయి అబ్బాయి చనిపోతే వారి ఆత్మలకు శాంతి చేకూర్చేందుకు వారి కుటుంబసభ్యులు ఇలాంటి ఘోస్ట్ మ్యారేజీలు చేస్తారు. ఆ తర్వాత ఇద్దరి శవాలను ఒకే చోట పూడ్చిపెడతారు. ఇక పెళ్లి కాకుండా చనిపోయిన వారి విషయానికొస్తే వారి ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ బ్రోకర్స్ ను కాంటాక్ట్ అయి తమకు తగ్గ మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటారు.
మరిన్ని వీడియోల కోసం
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్ వీడియో