
కానీ గమ్య స్థానానికి చేరడం కోసం స్పీడ్ లిమిట్ లేకుండా పరుగులు పెట్టే వాహనదారులు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు.. పొగ మంచు ప్రభావంతో ముందున్న వాహనాలను గుర్తించలేక కొందరు.. రహదారులపై గుంతలను గమనించలేక జరుగుతున్న మరికొన్ని ప్రమాదాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సూర్యుడు ఉదయించక ముందే వాళ్ల ప్రాణాలు ఆ పొగ మంచులో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారులపైనే అత్యధికంగా పొగ మంచు వల్ల ప్రమాదాల సంభవిస్తున్నాయి.. కొన్ని డేంజర్ స్పాట్స్ గుర్తించి అక్కడ ప్రమాద సూచికలు పెట్టినా వాహనదారుల్లో మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు.. రహదారులను కామ్మేసిన పొగ మంచు వాహనదారుల ప్రాణాలు మింగేస్తుంది.. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది..ఈ పొగ మంచు ప్రమాదాల వల్ల ఎంతోమంది విగత జీవులుగా మారుతున్నారు..
మరిన్ని వీడియోల కోసం :
అదీ మనవడా, అట్లా చేయాలి..మనవడిని చూసి మురిసిపోయిన కేసీఆర్ వీడియో!
నుమాయిష్ ఎగ్జిబిషన్ రైడ్లో తలకిందులుగా.. తర్వాత ఏమైందంటే..
భారత్లో రియల్ ఎస్టేట్ దూకుడు..53% పెరిగిన విక్రయాలు!