
భక్తితో ఓ వృద్ధురాలు శివుని కోసం చేసే ప్రసాదం గురించి తెలిస్తే అమ్మో అనాల్సిందే..! ప్రతిరోజూ ఆలయంలో నైవేద్యం కోసం ప్రసాదం చేయడమే పెద్ద ప్రహసనం. శుద్దిగా ఉంటూ నిష్ఠగా తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రమే భగవంతునికి నైవేద్యంగా పెడుతుంటారు. అన్ని ఆలయాల్లోనూ ఇలాగే ప్రసాదాలను తయారుచేసి నైవేద్యంగా పెడుతుంటారు. తమిళనాడులోని ఓ ఆలయంలో మాత్రం 92 ఏళ్ల వృద్ధురాలు ఎంత సాహసంగా ప్రసాదం తయారుచేసి నైవేద్యంగా పెడతారో తెలిసినవారు మాత్రం మట్టిలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోకమానరు..!
కాగుతున్న నూనె దగ్గరకు వెళ్ళాలి అంటేనే భయంతో వణికిపోతాం. అలాంటిది కుతకుతమంటున్న నూనెలో చేయి పెట్టి అందులో అప్పం వేసి తీసి శివుడికి ప్రసాదంగా సమర్పిస్తున్నారు. అంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది కదూ..! అవును తమిళనాడు రాష్ట్రంలో 52 ఏళ్లుగా ముత్తమ్మాళ్ అనే వృద్ధురాలు చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్ ముదలియార్పట్టి వీధిలోని భద్రకాళియమ్మన్ ఆలయం ఉంది. శివరాత్రి రోజున అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంలో బియ్యం, తాటిబెల్లంతో చేసిన లడ్డూల వంటి అప్పంను శివుడికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. అప్పాన్ని వేడి నెయ్యిలో నుంచి గరిటె వాడకుండా తీయాల్సి ఉంటుంది. శతాబ్ద కాలంగా వస్తున్న ఈ ఆచారాన్ని 52 సంవత్సరాలుగా 92 ఏళ్ల ముత్తమ్మాళ్ చేస్తున్నారు.
ఇందుకోసం ఆమె 40 రోజులపాటు వ్రతం చేస్తారు. అప్పం చేశాక గుడికి వచ్చిన భక్తులు ఆ నెయ్యిని తలకు రాసుకొని, దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆలయ ప్రాంగణంలో పొయ్యి ముందు కూర్చున్న ముత్తమ్మాళ్ ఈ సాహసం చేస్తుంటే చుట్టూ చేరిన భక్తులు శివనామస్మరణలో మునిగిపోతారు.
ఇటీవల జరిగిన శివరాత్రి వేడుకల సందర్భంగా మరోసారి ఈ సాహసం చేస్తున్న ముత్తమ్మాళ్ ను చూసిన భక్తులు శివ నామస్మరణలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు గడిచిన 52 సంవత్సరాలుగా ఇదేవిధంగా కాగే నూనెలో చేయి పెట్టి ప్రసాదాలు తయారుచేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిన భక్తులు. ఇదంతా శివుని మహిమ గా చెప్పుకుంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..