
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా స్టార్ హీరోలు ఫ్యామిలీకి కావాల్సినంత సమయం ఇస్తూ ఉంటారు. నెలల తరబడి సినిమా షూటింగ్ లతో బిజీగా గడిపే హీరోలు, హీరోయిన్స్ ఛాన్స్ దొరికితే తమ ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఉంటారు. తాజాగా ఓ బడా హీరోకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ స్ట హీరో తన ఫ్యామిలీతో కలిసి ఇలా టైం పాస్ చేశాడు. తన కూతుర్లు ఆ స్టార్ హీరోకు ఇలా మేకప్ వేశారు. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఒకొక్క సినిమాకు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో అతను. ఆ మేకప్ లో మనోడిని గుర్తుపట్టలేరు. అతను ఎవరో చెప్పడానికి.. ట్రై చేయండి.. కష్టంగా ఉందా.? అయితే మేమే చెప్పేస్తాం.
పై ఫొటోలో ఉన్న నటుడు హాలీవుడ్ స్టార్ హీరో. అతని పేరు డ్వేన్ జాన్సన్ ఇలా చెప్తే చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు కానీ ది రాక్ అని చెప్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అవును అతను రాక్. WWE సూపర్‌స్టార్ డ్వేన్ జాన్సన్( ది రాక్) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్లలో డ్వేన్ ఒకరు.అతన్ని ఫిట్నెస్ ఫ్రీక్‌గా పిలుస్తుంటారు అభిమానులు. wweలో ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
రెసిలింగ్ లో సూపర్ స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్న డ్వేన్ జాన్సన్. ఆతర్వాత హీరోగా మారాడు. డ్వేన్ జాన్సన్ హీరోగా హాలీవుడ్ లో పలు సినిమాలు తెరకెక్కాయి. అంతేకాదు డ్వేన్ జాన్సన్ రెమ్యునరేషన్ కొన్ని వందల కోట్లు ఉంటుంది. ప్రపంచాన్ని ఎంత షేక్ చేసినా.. తన కూతుళ్ల ముందు ఇలా చంటి పిల్లాడిలా మారిపోయాడు. తాజాగా డ్వేన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియోలో డ్వేన్ కూతుర్లు తనకు మేకప్ వేస్తూ కనిపించారు. చేతికి దొరికిన కలర్ వేస్తూ.. స్టార్ హీరోను ఇలా రెడీ చేశారు. ఇద్దరు కూతుళ్లు రాక్‌ను మేకప్ తో రెడీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.