
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల శరీరానికి, ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. రోజూ కాసేపు వాకింగ్ చేస్తే ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. తద్వారా ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. మంచి మూడ్ లభిస్తుంది.