
రాశీ ఖన్నా మోడలింగ్ తో తన కెరీర్ మొదలు పెట్టింది. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు నవంబర్ 30, 1990న న్యూఢిల్లీలో జన్మించింది. డిగ్రీ చదువుకున్న తర్వాత, ఆమె మోడలింగ్‌లోకి ప్రవేశించి, తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టింది.
రాశీ 2013లో హిందీ చిత్రం మద్రాస్ కెఫేలో రూబి సింగ్ పాత్రతో సినీరంగ ప్రవేశం చేసింది. 2014లో “ఊహలు గుసగుసలాడే” చిత్రంతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అలాగే ఈ సినిమాతో సైమా అవార్డు కూడా అందుకుంది ఈ చిన్నది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ చిన్నది. తమిళ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలాగే హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.
రాశీ ఖన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నపటికీ స్టార్ హీరోయిన్ క్రేజ్ మాత్రం అందుకోలేకపోతుంది. అంతే కాదు పెద్ద సినిమా ఆఫర్స్ కూడా ఈ చిన్నదానికి రావడం లేదు. దాంతో రాశి ఫాన్స్ కాస్తనిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ కు నిద్ర దూరం చేస్తుంది ఈ వయ్యారి భామ.