వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన చెట్ల మధ్యలో ఓ చిన్న పూరిల్లు ఉంది. ఆ గుడిసెలాంటి ఇంటిముందు ఏసీ అవుట్ డోర్ యూనిట్ ఉంది. దానిపైన కొన్ని వంటపాత్రలు కూడా ఉన్నాయి. ఏదో పాడయిపోయిన ఏసీకి సంబంధించినది ఇలా వాడుకుని ఉంటారులే అనుకుంటే పొరపాటే.. ఆ గుడిసె లోపలికి వెళ్లి చూస్తే లోపల ఏసీ బిగించి ఉంది. అలాగే మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఓ వ్యక్తి డబుల్ కాట్ బెడ్ మీద హాయిగా పడుకుని, స్నాక్స్ తింటూ ఎల్ఈడీ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మందికి పైగా వీక్షించారు. నాలుగున్నర లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ఇది వీఐపీ టెంట్ అని ఒకరు … నేను కూడా ఇలాంటి పేద బతుకును కోరుకుంటున్నా అని మరొకరు … ఈ ప్రపంచంలో పేదరికం మొత్తం ఇంత అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది అని ఇంకొకరు కామంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో
