
భార్యను తనతో పంపించాలని భర్త రోడ్డుపై బైటాయించాడు. తనతో పంపిస్తానే ఇక్కడి నుంచి కదులుతానని అక్కడే మకాం వేశాడు.. పోలీస్ స్టేషన్ ఎదుటనే భర్త ఆందోళన చేయడం సంచలనంగా మారింది.. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.. చివరకు చేసేదేం లేక.. అతనికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించాడు. అర్ధగంట సేపు నానా హడావిడి చేసిన ఆ వ్యక్తి.. చివరకు పోలీసుల సూచనలతో శాంతించాడు.. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ యువకుడు తన భార్యను తనతో పంపించేందుకు పోలీసులు సహకరించాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించాడు. తన భార్యను తనతో పంపించాలని పోలీసులను వేడుకున్నాడు. రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపాడు.. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది..
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘర్షనగర్ కి చెందిన గుంజే రాజు అనే యువకుడు కుటుంబంతో కొన్నేళ్లుగా జీవిస్తున్నాడు. కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తెలెత్తాయి.. దీంతో రాజు భార్య పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. ఇకనైనా రావాలంటూ రాజు కోరగా.. ఆమె వచ్చేందుకు నిరాకరించింది..
భార్యా భర్తల గొడవల మధ్య.. అత్తింటి వారు భార్యను కాపురానికి పంపించకపోవడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు రాజు.. పోలీసులు తన భార్య కాపురానికి వచ్చేవిధంగా చూడాలని కోరుతూ రాజు పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధనగ్నంగా అందోళనకి దిగాడు. దీంతో పోలీసులు రాజును స్టేషన్ కి తరలించి కౌన్సెలింగ్ చేపట్టారు.
భార్యను పిలిపించి కౌన్సిలింగ్ చేపడుతామని పోలీసులు హామీ ఇవ్వడంతో రాజు శాంతించాడు.. ఇలా ఆందోళన చేయడం తగదని.. అర్థ గంటసేపు.. రాకపోకలు నిలిచిపోయాయని పోలీసులు సూచించారు. అయితే.. తన భార్య రాకపోతే మరో సారి ఆందోళన చేస్తామని భర్త రాజు పేర్కొంటున్నాడు.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..