
దీని వల్ల ఏది కొనాలో ఏది మంచిదో తెలియక కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటప్పుడు పుచ్చపండును ఈజీగా కనిపెట్టే టెక్నిక్స్ ఇవి. పుచ్చకాయను కట్ చేసి చూపించమని అడిగి మరీ కొంటుంటారు. ఇలా చేయడం వల్ల అది లోపల ఎలా ఉంది దాని రుచి వంటివి తెలుసుకోవచ్చు. కానీ రెండు గంటల్లోపే అది పాడైపోవడం మొదలవుతుంది. కొన్ని అరుదైన రకం పుచ్చకాయలు ఉంటాయి. వాటిపై తెల్లని మచ్చలు ఉంటాయి. అలాంటి మచ్చలు ఉన్న పండ్లు చాలా తియ్యగా లోపల చాలా ఎర్రగా ఉంటాయి. మీరు ఎంచుకునే పుచ్చకాయ గుడ్డు ఆకారంలో లేదా బంతి ఆకారంలో ఉండాలి. దానికి ఒక నిర్దిష్ట ఆకారం ఉండాలి. అలాంటి పుచ్చకాయ లోపల అన్ని వైపులా సమానంగా పండి ఉంటుంది. అలాగే, గింజల రేఖలు క్రమబద్ధమైన ఆకారంలో ఉంటాయి. మీరు కొనే పుచ్చకాయ బరువుగా ఉంటే, అది రుచికరంగా ఉంటుంది. అంటే కనీసం 2 కిలోల బరువు ఉండాలి, అప్పుడు పండు మధ్యలో మృదువైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది చిన్న పుచ్చకాయలలో ఉండదు. కాబట్టి, మీరు కొంచెం పెద్దదిగా ఉండే పండును ఎంచుకోవడం మంచిది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో సిగరెట్ వెలిగించి మహిళ.. ఒక్కసారిగా..!
భర్త హత్యకు స్కెచ్.. సుపారీలిచ్చి మరీ మ*ర్డర్స్.. ప్రాణాలు తీస్తున్న పక్క చూపులు
ఆ గెలాక్సీలో ఆక్సిజన్! 1,340 కోట్ల కాంతి సం.ల దూరంలో
జనాలను పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంట్లు..
టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. సానుభూతి తెలిపిన పవన్