
పార్క్ హయత్ అగ్ని ప్రమాదం సంభవించింది. అదే హోటల్లో సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు ఉండటం ఆందోళనలు రేకితిస్తోంది. అయితే ఈ ఘటనపై Tv9 తో డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. హోటల్ మొదటి ఫ్లోర్లో అగ్ని ప్రమాదం సంభవించిందని, ఆ సమయంలో ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు 5వ ఫ్లోర్ లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. స్పా రూమ్స్ లో స్టీమ్ బాత్ చేసే ప్రాంతంలో షర్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. స్పా రూమ్స్ ఉడ్ తో తయారు చేసి ఉంది.. అందుకే మంటలు అంటుకున్నాయని, పొగ దట్టంగా కమ్ముకోవడం వల్ల ప్రమాదం జరిగిన చోటుకు పార్క్ సిబ్బంది వెళ్లలేకపోయారని పేర్కొన్నారు.
పార్క్ హయత్ సిబ్బంది జూబ్లిహిల్స్ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారని, వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పాటు పొగను కూడా అదుపులోకి తీసుకొచ్చినట్లు వెంకన్న వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో 5వ అంతస్థులలో సన్రైజర్స్ ప్లేయర్లు ఉన్నారని, ప్రమాదం జరిగిన వెంటనే SRH టీమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిందనే దాంట్లో నిజం లేదని, వాళ్ళు ముంబై తో మ్యాచ్ కోసం ఈ రోజు మధ్యాహ్నం 12కు ముంబై బయల్దేరారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆటగాళ్లకు ఎలాంటి అపాయం కలగలేదు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..