
శ్రీ సత్య సాయి జిల్లా రోళ్ళ మండలం జీర్గేపల్లి గ్రామంలోని సారక్క అమ్మవారి ఆలయం ఉంది. రోజూలాగే ఉదయం, సాయంత్రం ఆలయంలో నిత్యకైంకర్యాలు నిర్వహించి పూజారులు తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఈ ఆలయంలోకి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. అయితే భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆహారం కోసం తరచూ రాత్రి సమయాల్లో ఆలయ ప్రాంగణంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. అవి ఎక్కడ ఇళ్లలోకి చొరబడతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను సమీప అటవీ ప్రాంతంలోకి తరలించాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
TOP 9 ET News: దేవరని వెనక్కి నెట్టి.. చరిత్ర సృష్టించిన పెద్ది
Court OTT: OTTలోకి కోర్టు మూవీ.. అఫీషియల్ డేట్ వచ్చేసింది..
Chhaava OTT: గుడ్ న్యూస్ OTTలోకి ‘ఛావా’ డేట్ పిక్స్ ??