
అతడిని అరెస్టు చేసి కరాచీ జైల్లో ఉంచారు. నాటినుంచి అతడు అక్కడి కారాగారంలోనే మగ్గిపోతున్నాడు. అయితే.. మంగళవారం రాత్రి బాత్రూమ్లోకి వెళ్లిన మత్స్యకారుడు తాడుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడు ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో అనుమానించిన జైలు అధికారి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసేంతవరకు మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. కాగా.. గత నెలలో తమ కారాగారంలో ఉన్న 22 మంది మత్స్యకారులను పాక్ ప్రభుత్వం విడుదల చేసింది. వారి శిక్షాకాలం పూర్తికావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి విడుదల చేసింది.
మరిన్ని వీడియోల కోసం :
గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. వీడియోలు వైరల్
కింగ్ కోబ్రాతో ఇదేమి సయ్యాట సామి.. వీడియో
రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది.. RC 16 టైటిల్ ఇదే!
మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్ వీడియో