
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి ప్రధానమంత్రి నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా పాల్గొన్నారని అధికారులు తెలిపారు.
ఈ సమావేశం తర్వాత పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. అట్టారి చెక్ పోస్ట్‌ను వెంటనే మూసివేయాలని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీకి వివరంగా వివరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఆ తర్వాత అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. పహల్గామ్ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. ఇంకా చాలా మంది గాయపడ్డారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ దాడిని సీసీఎస్ తీవ్రంగా ఖండించింది. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అండగా నిలవాలని నిర్ణయించింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. ఉగ్రవాదం పట్ల ఎలాంటి సహనాన్ని ప్రదర్శించకూడదని సీసీఎస్ నిర్ణయించిందన్నారు.
భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయాలుః
పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి విశ్వసనీయంగా, తిరుగులేని విధంగా మద్దతు ఇవ్వడం మానుకునే వరకు 1960 నాటి సింధు జల ఒప్పందం తక్షణమే నిలిపివేయాలని నిర్ణయం.
అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ తక్షణమే మూసివేయడం జరగుతుంది. చెల్లుబాటు అయ్యే అనుమతితో సరిహద్దు దాటిన వారు 2025 మే 1 లోపు ఆ మార్గం ద్వారా తిరిగి రావచ్చు.
సార్క్ వీసా మినహాయింపు పథకం (SVES) వీసా కింద పాకిస్తానీ జాతీయులు భారతదేశానికి ప్రయాణించడానికి వీలులేదు.
పాకిస్తానీ జాతీయులకు గతంలో జారీ చేసిన SVES వీసాలు రద్దు.
SVES వీసా కింద ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఏ పాకిస్తానీ జాతీయుడైనా భారతదేశం విడిచి వెళ్ళడానికి 48 గంటల గడువు.
న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లోని రక్షణ, సైనిక, నావికా, వైమానిక సలహాదారులను పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించారు. భారతదేశం విడిచి వెళ్ళడానికి ఒక వారం గడువు ఇస్తూ నిర్ణయం.
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుండి భారతదేశం తన రక్షణ, నావికాదళ, వైమానిక సలహాదారులను ఉపసంహరించుకుంది. సంబంధిత హై కమిషన్ల రద్దు.
న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లోని రక్షణ, సైనిక, నావికా, వైమానిక సలహాదారులను పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించారు. వారు భారతదేశం విడిచి వెళ్ళడానికి ఒక వారం సమయం ఇచ్చింది భారత ప్రభుత్వం. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుండి భారతదేశం తన రక్షణ, నావికాదళ, వైమానిక సలహాదారులను వెనక్కి పిలిపిస్తుంది. ఈ పదవులను సంబంధిత హైకమిషన్లలో రద్దు చేసినట్లు సీసీఎస్ నిర్ణయించింది. సర్వీస్ అడ్వైజర్లకు చెందిన ఐదుగురు సహాయక సిబ్బందిని కూడా రెండు హైకమిషన్ల నుండి వెనక్కి పిలిపిస్తారు. 2025 మే 01 నాటికి మరింత తగ్గించడం ద్వారా మొత్తం హైకమిషన్ల సంఖ్య ప్రస్తుత 55 నుండి 30కి తగ్గుతుంది అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం(ఏప్రిల్ 23) ఉదయం సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని తిరిగి వచ్చారు. ఇంతలో హోంమంత్రి అమిత్ షా మహల్గా్మ్లో భద్రతా చర్యలను సమీక్షించడానికి మంగళవారం సాయంత్రం శ్రీనగర్ చేరుకున్నారు. బుధవారం శ్రీనగర్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి తిరిగి వచ్చి సీసీఎస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కశ్మీర్లో వాస్తవ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించారు.
ఇవి కేవలం ఆంక్షలు, కొన్ని నిర్ణయాలు మాత్రమే. అసలు సిసలు రివెంజ్ ఇకపై ఉంటుందన్న స్థాయిలో అంతకుముందు మాట్లాడారు రక్షణమంత్రి రాజనాథ్ సింగ్. ప్రపంచం ఆశ్చర్యపోయే సమాధానం ఇస్తామన్నారు రాజ్‌నాథ్. ఏ ఒక్కరినీ వదిలేది లేదని రక్షణ మంత్రి ఘాటుగా చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..