
డాకు మహారాజ్ సినిమా చూసిన వారందరూ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నుంచి మేం కోరుకున్న సినిమా ఇదే కదా అనుకున్నారు. అటు వెంకీమామ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేశారు. గేమ్ చేంజర్‌లో చరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. వీటన్నిటితో పాటు రీలోడెడ్ వెర్షన్‌తో రంగంలోకి దూకి దూసుకుపోతున్నాడు పుష్పరాజ్. జనవరి సంబరాలు ఇంతటితో ఆగలేదు.. నెలాఖరున వచ్చే దేవాలో పూజా హెగ్డే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలని వెయిటింగ్లో ఉన్నారు ఆడియన్స్.
పూజాకి ఈ ఏడాది కలిసొస్తుందో లేదో చూసుకున్నాక, అందరి చూపులూ అజిత్ వైపు తిరగనున్నాయి. ఆయన నటించిన విడా ముయర్చి సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంక్రాంతికి విశ్వంభర రిలీజ్‌ని మిస్ చేసుకున్న త్రిష, ఫిబ్రవరిలో పట్టుదలతో అజిత్‌తో కలిసి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు.
ఈ మధ్యనే సెట్లో చేపల పులుసు వండి ఘుమఘుమలాడించిన తండేల్ రాజు నాగచైతన్య వచ్చే నెల్లో థియేటర్లలోకి దూసుకొచ్చేస్తున్నారు. బుజ్జితల్లీ వచ్చేత్తున్నాను గదే, అని నాగచైతన్య అంటే సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు సినీ జనాలు. అనౌన్స్ మెంట్ నుంచే హైప్ తెచ్చుకుంది తండేల్ సినిమా.
వెరైటీ ప్రమోషన్లతో సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే విశ్వక్సేన్, ఈ సారి వెరైటీ కంటెంట్‌తో జనాలను పలకరించడానికి రెడీ అవుతున్నారు. లైలాలో ఆయన లేడీ గెటప్‌కి సూపర్‌డూపర్ మార్కులు పడిపోయాయి. లుక్స్ పరంగా ఓకే, పెర్ఫార్మెన్స్ పరంగా లేడీ గెటప్‌లో ఏం చేశారో చూడాలంటే మాత్రం ఫిబ్రవరిదాకా వెయిట్ చేయాల్సిందే మరి.
దీపావళికి క సినిమాను విడుదల చేసిన అనూహ్యమైన హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా కన్నా ముందే, ఆయన చేసిన సినిమా దిల్ రూబా. పర్ఫెక్ట్ టైమ్ చూసుకుని రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. కతో వచ్చిన సక్సెస్‌ని దిల్రూబాతో నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు కిరణ్.
తెలుగులో పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు సందీప్ కిషన్. ఆయన నటించిన మజాకా సంక్రాంతి రేసులో ఉంటుందనుకున్నారు. కానీ పెద్ద సినిమాల మధ్య ఎందుకని, ఫిబ్రవరికి మూవీని పుష్ చేసింది యూనిట్. కలర్‌ఫుల్ పోస్టర్లతో ఆకట్టుకుంటున్నారు సందీప్. మరి థియేటర్లలో ఏమేరకు మెప్పిస్తారోననే డిస్కషన్ కూడా జరుగుతోంది.
లవ్ టుడే సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరైన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన నటించిన సినిమా డ్రాగన్. అనుపమ పరమేశ్వరన్ కీ రోల్ చేస్తున్నారు. వేలంటైన్స్ డే కి రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే ఒన్ వీక్ లేట్‌గా.. ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నారు.
బ్రహ్మానందం తాతగా, ఆయన కుమారుడు రాజా గౌతమ్ మనవడిగా నటిస్తున్న సినిమా బ్రహ్మానందం. ఈ సినిమాను కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆల్రెడీ కుమారుడితో కలిసి ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు బ్రహ్మానందం.