
బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. అంతే కాకుండా, సినిమాల్లో కీలకపాత్రల్లో కనిపిస్తూ తన నటనతో మంచి గుర్తింపుతెచ్చుకుంటుంది.
టీవీ షోలలో ఈ ముద్దుగుమ్మ చేసే అల్లరి మాములుగా ఉండదు. తన చిలిపితనంతో అందరినీ కట్టిపడేస్తుంది. అంతే కాకుండా ఈ చిన్నది ఎప్పుడూ చాలా అల్లరిగా ఎనర్జటిక్ గా ఉంటుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది, ఎప్పుడూ తన గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ, తన అంద, చందాలతో కుర్రకారును మాయ చేస్తుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ, కలర్ ఫుల్ లంగావోణిలో తన అందచందాలతో కట్టిపడేస్తుంది. అయితే ఉగాది సందర్భంగా ఈ అమ్మడు ట్రెడిషనల్ లుక్ లో దర్శనం ఇచ్చినట్లు తెలుస్తోంది. పండుగ సందర్భంగా రంగులన్ని కలగలిపిన లంగావోణిలో చాలా అందంగా కనిపించింది..
ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో, అచ్చం తెలుగు అమ్మాయిలా, పరికిణిలో చూడముచ్చటగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్.