
రీసెంట్ గా చాలా సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. చిన్న పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే మరికొన్ని సినిమాలు చిన్న సినిమాలుగా విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. ఇక ఒక సినిమా విడుదలైతే వెంటనే సినిమా రివ్యూలు రాసేస్తున్నారు. ప్రేక్షకులు సినిమా రివ్యూలు చూసి సినిమాల పై అంచనాలకు వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమా గురించి నెటిజన్ నెగిటివ్ కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ కు హీరో అదిరిపోయే రిప్లే ఇచ్చాడు. నీ సినిమా చూడటం కంటే బిర్యానీ తినడం బెటర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఆ సినిమా ఏదంటే.. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా చేసి పాపులర్ అయ్యాడు. ఇప్పుడు హీరోగా మారి సినిమా చేస్తున్నాడు ప్రదీప్. 3ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ నెటిజన్ నెగిటివ్ కామెంట్ చేశాడు.
ఓ నెటిజన్స్ ప్రదీప్ సినిమా గురించి స్పందిస్తూ.. “ప్రదీప్ కోసం మూవీకి వెళ్దాం అనుకున్నా, కానీ ఆ రివ్యూస్ చూశాక నా డబ్బులు వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మంచిగా అదే పైసలతో బిర్యానీ ఆర్డర్ చేసి నెట్ఫ్లిక్స్లో కోర్ట్ సినిమా చూసుకుందాం’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ పై హీరో ప్రదీప్ మార్చి రాజు స్పందించాడు. “ఏం పర్లేదు భయ్యా ఒకసారి ట్రై చెయ్.. సరదాగా నవ్వుకొని వచ్చేయ్.. చూశాక చెప్పు భయ్యా బిర్యాని కూడా నేనే పంపిస్తా” అని ఫన్నీగా రిప్లే ఇచ్చాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..