

అందుకే ఇలా బిగ్గరగా హారన్ పెట్టుకుని వాహనదారులను విసిగిస్తున్నవారికి వినూత్న పనిష్మెంట్ ఇచ్చారు కర్నాటక ట్రాఫిక్ పోలీసులు.భయంకరంగా హారన్ మోగిస్తూ ఇతర వాహనదారులను, పాదచారులను ఇబ్బంది పెడుతున్న ఓ డ్రైవర్‌ను అదే బస్సు ముందు కూర్చోబెట్టి హార్న్ వినిపించారు. దీంతో సదరు డ్రైవర్ ఆ సౌండ్ భరించలేక అల్లాడిపోయాడు. గట్టిగా చెవులు మూసుకున్నాడు. నన్ను వదిలేయండి సార్ మీకు దణ్ణం పెడతాను అంటూ వేడుకున్నాడు. నువ్వు హారన్ కొట్టినప్పుడు ఎదుటివ్యక్తులు కూడా ఇలాంటి ఇబ్బందులకే గురవుతారు. అంత భారీ సౌండ్‌తో హారన్ కరెక్ట్ కాదని అర్ధమైందా అంటూ.. ప్రాక్టికల్‌గా చూపించారు పోలీసులు. దీంతో పోలీసులను ప్రశంసిస్తూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పోలీసుల ఆపరేషన్ సూపర్.. తను నడిపే బస్సు ముందే కూర్చొపెట్టి హారన్ కొట్టి బుద్ది చెప్పడం అదుర్స్ అని కొందరు వ్యాఖ్యానించారు. ఇలా అన్ని రాష్ట్రాల్లో చేస్తే బాగుంటుందని.. వాహనాల్లో ప్రయాణించే చిన్న పిల్లలు, వృద్ధులు శృతిమించిన హారన్ సౌండ్స్ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారని.. పలువురు అభిప్రాయపడుతున్నారు.