
నిందితులు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చి ఎటాక్ చేశారు అంతా మిస్టరీగానే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఎటువైపు పరారయ్యారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చూస్తుంటే ఈ గ్యాంగ్ పక్కాగా రెక్కీ చేసి ఇలా ఎటాక్ చేసినట్టు అర్థమవుతోంది. గన్స్‌తో రావడం, ఎటాక్ చేయడం.. ఆపై డబ్బుతో పారిపోవడం అంతా కళ్లుమూసి తెరిచేలోగా జరిగిపోయింది. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కర్నాటకలోని బీదర్‌లో CMS ఏజెన్సీకి చెందిన సిబ్బంది జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో లోడ్ చేయడానికి తమ సెక్యూరిటీ వాహనంలో డబ్బు తీసుకొచ్చారు. ఆ డబ్బులను ATMలో పెట్టేందుకు సిద్ధమైన టైమ్‌లో ఈ ఫైరింగ్ జరిగింది. వాహనంలోంచి డబ్బు తీసి ATM లో డిపాజిట్ చేయడానికి వెళుతుండగా అప్పటికే మాటు వేసి అక్కడున్న ముఠా బైక్‌పై వేగంగా వచ్చి కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది స్పాట్లోనే చనిపోయారు. నగరం నడిబొడ్డున పట్టపగలు ఈ దోపిడికి పాల్పడటం కలకలం రేపింది. దోపిడీ ముఠా కోసం విచారణ ముమ్మరం చేశామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
H-1B Visa: అమెరికన్ ఉద్యోగులకు H1B ముప్పు
మహా కుంభమేళాలో గోల్డెన్ బాబా.. ఒళ్లంతా బంగారమే
నరకం నుంచి విముక్తి.. హమాస్ బందీల భావోద్వేగం..
ఎమర్జెన్సీ సినిమా బ్యాన్.. సిక్కుల తీవ్ర ఆందోళనలు
అవును.. సైఫ్‌పై దాడి చేసింది నేనే.. అంగీకరించిన నిందితుడు