
మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన ఓ వివాహ వేడుక ఊరేగింపు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఊరేగింపు వెళ్తుండగా, పెళ్లికి వచ్చిన అతిథులు పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ వెళ్తున్నారు. అంతలోనే ఓ లగ్జరీ కారు వేగంగా దూసుకొచ్చింది. ఊరేగింపులో ఉన్న పలువురిని ఆ కారు ఢీకొట్టింది. ఆగకుండా అలాగే ముందుకు దూసుకెళ్లిన కారు.. వేగంగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ సంఘటన సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సదర్ బజార్ ప్రాంతంలో జరిగింది.
ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం రోడ్డు పక్కన అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. స్థానికుల సమాచారం మేరకు సిటీ కొత్వాలి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న స్టేషన్ ఇన్ఛార్జ్ వెంటనే పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి
ప్రమాదం జరిగిన వెంటనే జనం కారు డ్రైవర్‌ను పట్టుకున్నప్పటికీ, అతడు వారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడని తెలిసింది. ప్రస్తుతం పోలీసులు గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.