వేప పేస్ట్ తయారు చేసుకుని చర్మానికి అప్లై చేసుకోవటం వల్ల చర్మాన్ని దోమల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. తాజా వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకోండి. మీకు కావాలంటే, మీరు దానికి కొంచెం కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్‌ను పడుకునే ముందు చేతులు, కాళ్ళు, మెడపై రాయండి. దీని బలమైన వాసన దోమలు మీ దగ్గరికి రానివ్వదు, ఇది పిల్లలకు కూడా సురక్షితం.
