
వీరు చేయాల్సిందల్లా దొంగతనాలు మాత్రమే. ఈ దొంగలు తమ టాలెంట్ ఉపయోగించి సెల్ ఫోన్లు కొట్టేయడమే పని. రద్దీ ప్రదేశాల్లో అమాయకులను టార్గెట్ చేసి వారి సెల్ ఫోన్లను చాకచక్యంగా కొట్టేస్తారు. ఫోన్ నెంబర్లకు లింక్ చేసిన బ్యాంకు ఖాతాల్లోని డబ్బును క్షణాల్లో కోట్టేస్తున్నారు కేటుగాళ్ళు. జనాలను ఏమార్చి ఫోన్ కొట్టేసిన వెంటనే వారు వచ్చిన కారులో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఫోన్‌ను అన్‌లాక్ చేస్తారు. ఆ వెంటనే గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ యాప్‌లు ఓపెన్ చేసి ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్‌తో మీ పిన్ మార్చేసి ఓటీపీ ద్వారా కొత్త పిన్ జనరేట్ చేస్తారు. కొత్త ఓటీపీతో ఖాతాల్లోని డబ్బుని కాజేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల జరిగిన పెద్దగట్టు జాతరలో దృష్టి మరల్చి సెల్ఫోన్లు కొట్టేసి ఐదు ఖాతాల నుంచి సుమారు 4.5 లక్షల రూపాయలు దోచేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు. మరో దొంగతనం కోసం వెళ్తున్న ఈ ముఠాను చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ ఫ్లైఓవర్ వద్ద పట్టుకున్నారు. నిందితుల నుండి 3.5 లక్షల నగదు, రెండు కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి రాజు కోసం ప్రత్యేక టీమ్‌లతో గాలిస్తున్నట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాట్ ఎయిర్ బెలూన్ తో పై కెళ్లిన వ్యక్తి.. తెగి పడ్డ తాడు.. ఏం జరిగిందంటే..
వామ్మో ..! నీళ్ల బాటిల్ ధర రూ. 50 లక్షలా?
Samantha: రెండో పెళ్లికి సమంత రెడీ.. మేలో ముహూర్తం?
QR కోడ్ స్కాన్ చేస్తున్నారా ?? మీ బ్యాంక్ ఖాతా జాగ్రత్త!
తిమింగలం కక్కిన పదార్థానికి.. ఫుల్ డిమాండ్.. ఏమిటి దాని స్పెషల్ ??