

సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో.. అంతే నష్టం కూడా ఉంటుంది. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో హీరోయిన్స్ గురించి ఎంత పాజిటివ్ ఉంటుందో అంతే నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ అంటూ రెగ్యులర్ గా నెట్టింట రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక సెలబ్రెటీలు ఏ చిన్న తప్పు చేసిన ఓ రేంజ్ లో ట్రోల్స్ పుట్టుకొస్తాయి. ముఖ్యంగా హీరోయిన్స్ కు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్స్ పై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేయడం, ట్రోల్స్ చేయడం మనం చూస్తా ఉంటాం.. అయితే చాలా మంది హీరోయిన్ ట్రోలర్స్ ను లైట్ తీసుకుంటుంటారు. కానీ కొందరు మాత్రం తమ పై నెగిటివ్ కామెంట్స్ చేసేవారి పై ఫైర్ అవుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన పై నెగిటివ్ కామెంట్స్ చేసే వారి పై మండిపడింది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ త్రిష. సాధారణంగా త్రిష వివాదాలకు దూరంగా ఉంటుంది. ఆమె పై ఎక్కువగా ట్రోల్స్ కూడా ఎక్కడాకనిపించవు . కానీ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ పనిగట్టుకొని ఆమె పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ట్రోలర్స్ కు త్రిష స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. త్రిష రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించింది. ఈ సినిమా రీసెంట్ గా విడుదలైంది. అయితే కొంతమంది ఆకతాయిలు త్రిష గురించి సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు,. వారికి త్రిష స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
”మనుషులు ఇంత విషం నింపుకున్నారు. అసలు మీ జీవితం ఎలా ఉంటుంది.? మీ లైఫ్ లో ఎక్కువ శాతం బాగా నిద్రపోతారా.? సోషల్ మీడియాలో కూర్చొని ఇతరుల గురించి అర్థంలేని విషయాలు పోస్ట్ చేయడం పనిగా పెట్టుకున్నారా.? ఇలాంటివి చేస్తే నిజంగా మీకు సంతోషంగా అనిపిస్తుందా.? ఇతరుల గురించి నీచమైన పోస్టులు పెట్టే మీ వల్ల పక్కనున్న వారికి చాలా ప్రమాదం. పేరు చెప్పుకోలేని ఈ పిరికిపందలను చూస్తుంటే బాధగా ఉంది. వీరిని దేవుడే రక్షించాలి” అంటూ త్రిష రాసుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.