
ఈ క్రమంలోనే ఈ సంవత్సరం అత్యంత ఆసక్తికర చిత్రాల జాబితాను IMDB విడుదల చేసింది. కన్నడ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. యష్ హీరోగా, గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ‘టాక్సిక్’ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తర్వాత ఈ జాబితాలో తమిళ చిత్రం ‘జన నాయగన్’ మూడవ స్థానంలో ఉంది. దళపతి విజయ్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇక నాల్గవ స్థానంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘సికంధర్’ చిత్రం ఉంది. సల్మాన్ ఖాన్ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియాద్వాలా ఈ చిత్రానికి నిర్మాతంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ’ చిత్రం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్ కళ్యాణ్ పై బంగారం హీరోయిన్ క్రేజీ ట్వీట్
Anasuya: ఆంటీ అంటావా? దమ్ముంటే స్టేజ్‌పైకి రారా?