తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపాలిటీల్లో జనరల్‌కు మొత్తం 61 స్థానాలు కేటాయించారు. జనరల్ 30, మహిళలకు 31 స్థానాలు కేటాయించారు. బీసీలకు మొత్తం 38 మున్సిపాలిటీలను కేటాయించారు. బీసీ జనరల్-19, బీసీ మహిళ-19 మున్సిపాలిటీలను కేటాయించారు. ఎస్టీ జనరల్-3, ఎస్టీ మహిళ-2 , ఎస్సీ జనరల్-9, ఎస్సీ మహిళ-8 కేటాయించారు. మొత్తం సీట్లలో మహిళలకు 50 శాతం కేటాయించారు
10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు చెరొకటి కేటాయించారు. బీసీ జనరల్-2, బీసీ మహిళలకు 1 కార్పొరేషన్ కేటాయించారు. ఓసీ మహిళలకు 4, ఓసీ జనరల్‌కు 1 కార్పొరేషన్ కేటాయించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపునకు మార్గదర్శకాలను.. అలాగే.. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు..
మరోవైపు బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నాయి బీసీ సంఘాలు. కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటున్నాయి. ఆ తర్వాతే మున్సిపల్ ఎన్నికలు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి. వచ్చే పార్లమెంట సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సంక్షేమ పథకాలే.. కాంగ్రెస్‌ని గెలిపిస్తాయని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
