
స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. తెలుగులో ఒకప్పుడు తమన్నా టాప్ హీరోయిన్ గా రాణించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, భారీ హిట్స్ తో దూసుకుపోయింది. అదే సమయంలో తమిళ్ ఇండస్ట్రీ పై కూడా ఫోకస్ చేసింది. అలా తెలుగు, తమిళ్ లో రాణించిన ఈ చిన్నదానికి ఇప్పుడు ఆఫర్స్ తగ్గిపోయాయి.. తెలుగులో ఈ మధ్య కాలంలో తమన్నా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. కానీ హిందీలో మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తుంది. రీసెంట్ డేస్ లో తమన్నా స్పెషల్ సాంగ్స్ తోనూ అదరగొడుతుంది. తెలుగులో ఈ చిన్నది ఇప్పుడు ఓదెల 2లో నటిస్తుంది.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంలో, నటి తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఒక షోలో పాల్గొంది. ఈ వేడుకకు హాజరైన మరో యంగ్ బ్యూటీ తమన్నాను ఆంటీ అని పిలిచింది. దాంతో అందరూ షాక్ అయ్యారు.
బాలీవుడ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రవీనా టాండన్ కుమార్తె, రాషా దాదానీ తమన్నాను ఆంటీ అని పిలిచింది. ఈ వీడియోలో రాషా ఎదో మాట్లాడుతూ ఆంటీ అని పిలిచింది. తమన్నా షాక్ రియాక్షన్ ఇచ్చి, ఏం పర్లేదు నన్ను ఆంటీ అని పిలువు అని చెప్పింది. ఈ ఇప్పుడు వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తమన్నాను ఆంటీ అని పిలవగానే ఆమె ప్రియుడు విజయ్ వర్మ కూడా షాక్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
SHOCKINGLY #Tammana Says CALL ME AUNTY no issue #RashaTadani – Great Gesture From Tammu 😳😳😳😳😳
— GetsCinema (@GetsCinema) January 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.