
ప్రపంచంలో అనేక రకాల సంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి దేశంలోనూ వేర్వేరు సంఘాలు, తెగలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ వారి స్వంత నమ్మకాలు ఉన్నాయి. ఈ సమాజాల ఆచారాలు, సంప్రదాయాలు కూడా అంతే భిన్నంగా ఉంటాయి. కొన్ని ఆచార సంప్రదయాలను తెలిస్తే మనం జీర్ణించుకోలేనంత జుగుప్సకరంగా ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వింత ఆచారం ఒకటి. భారతదేశ పొరుగు దేశంలో ఊహించని ఆచారం ఒకటి అమల్లో ఉంది. బంగ్లాదేశ్‌లోని మండి కమ్యూనిటీలో ఒక వింత ఆచారం అమల్లో ఉంది. వీరి ఆచారంలో ఒక తండ్రి తన చిన్న కూతురిని వివాహం చేసుకోవచ్చు. ఈ సంప్రదాయం చాలా షాకింగ్‌గా ఉంటుంది.
బంగ్లాదేశ్‌లోని మండి తెగకు సంబంధించిన ఈ ఆచారం చాలా జుగుప్సకరంగా ఉంటుంది. ఇక్కడ ఒక తండ్రి తన చిన్న కూతురిని వివాహం చేసుకోవచ్చు. మండి తెగలో ఒక వ్యక్తి చిన్న వయస్సులోనే వితంతువుగా మారిన మహిళను వివాహం చేసుకుంటే, భవిష్యత్తులో అతను తన మొదటి భర్త కుమార్తెను వివాహం చేసుకోవచ్చునని ముందుగానే నిర్ణయించుకుంటారు. ఇది సవతి కూతురు సంబంధం. అయితే, దీని వెనుక వారు ఓ కారణం కూడా ఉందని చెబుతున్నారు.
భర్త మరణించిన ఆ తల్లి, తన కుమార్తెల భవిష్యత్తు సురక్షితంగా ఉండటానికి ఇలా చేస్తారని అంటున్నారు. ఒక పురుషుడు వారిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం మాత్రమే ఇది జరుగుతుందని నమ్ముతారు. ఈ దురాచారం కారణంగా సవతి తండ్రి తన సవతి కుమార్తెకు భర్తగా మారడమే కాకుండా, ఆమెతో శారీరక సంబంధాలు కూడా కలిగి ఉండవచ్చునని చెబుతున్నారు. కానీ, ఇలాంటి దారుణమైన ఆచారం తీవ్ర విమర్శలకు గురవుతోంది. చిన్న వయసులో ఒక వ్యక్తిని తండ్రి అని పిలిచే అమ్మాయి, తరువాత అతన్ని తన భర్తగా చేసుకోవటం ఎంటని సర్వత్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తంమవుతోంది. ఈ దుష్ట ఆచారం చాలాసార్లు విమర్శించబడింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..