
డ్రై ఫ్రూట్స్… ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసిందే.. ఐతే ఈ గింజలను నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు రెట్టింపవుతాయంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాము. బాదం పప్పులను నానబెట్టి తింటే మన శరీరానికి పోషకాలను గ్రహించే శక్తిని కలిగిస్తాయి. గుమ్మడి గింజలను రాత్రంతా నానబెట్టుకుని తింటే అందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల శరీరం వేగంగా పోషకాలను గ్రహిస్తుందని నిపుణులు అంటున్నారు.
నివేదిక ప్రకారం.. ఇంకా పచ్చి వాటితో పోలిస్తే నానబెట్టిన గింజలు తీసుకోవడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి సమస్యలు దరిచేరవని అంటున్నారు. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటితో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుందని వివరిస్తున్నారు. సాధారణ గింజల కంటే నానబెట్టిన గింజల్లో కేలరీల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రెండిట్లో పోషకాలు అన్నీ సమానంగానే ఉన్నా.. నానబెట్టిన గింజలతో లాభం కాస్త ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. నీళ్లను పీల్చుకున్న గింజల్లో రుచి ఎక్కువగానే ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలిందని పేర్కొన్నారు. బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని నానబెట్టి తీసుకోవడమే ఉత్తమమని వివరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
– వాల్ నట్స్ నీటిలో నానబెట్టుకుని తింటే అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
– ఓట్స్‌ను గంటపాటు నానబెట్టుకుని ఉడికించి తింటే పిండిపదార్థం విచ్ఛిన్నమై జీర్ణశక్తి మెరుగవుతుంది.
– కిస్మిస్లను రాత్రంతా నానబెట్టి తింటే వాటిలోని పోషకాలు రెట్టింపవుతాయి.
– సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగితే అవి శరీరాన్ని హైడ్రేట్‌గా వుంచుతాయి.
– అవిసె గింజలను రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..