ఇతర భాషల నుంచి చాలా మంది ముద్దుగుమ్మలు మన దగ్గరకు వచ్చి స్టార్స్ గా మారుతున్నారు. తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు వస్తున్నా కూడా ఇతర భాషల హీరోయిన్స్ మన దగ్గర స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. కన్నడ నుంచి వచ్చిన రష్మిక మందన్న తెలుగు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిందీ నుంచి వచ్చిన మృణాల్ మన దగ్గర టాప్ హీరోయిన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పేర్లు లిస్ట్ లో ఉంటాయి. అయితే ఇతర భాషల నుంచి వచ్చిన అందరు హీరోయిన్స్ సక్సెస్ అవ్వరూ.. కొంతమంది మాత్రం బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అందుకుంటూ ఉంటారు. దాంతో తిరిగి తమ ఇండస్ట్రీకి చెక్కేస్తుంటారు. అలానే ఓ అమ్మడు తెలుగులో రెండు సినిమాలు చేసింది. రెండు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్
తెలుగులో డిజాస్టర్ అందుకుంది.. బాలీవుడ్ లోనూ పెద్దగా హిట్స్ లేవు. ఆయినా కూడా ఇప్పుడు ఓ బడా హీరో పిలిచి మరి ఛాన్స్ ఇచ్చాడు ఆ అమ్మడికి.. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి కృతి సనన్. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు హిందీలో సెటిల్ అయిన భామ.. ముందుగా తెలుగులోనే నటించింది. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇవి కూడా చదవండి
బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..
ఆతర్వాత నాగచైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. మొన్నామధ్య ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ అనే సినిమా చేసింది. రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడికి సుకుమార్ ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. గతంలో సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడినే సినిమాలో కృతి హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు మరోసారి ఆమెకు సుక్కు ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది.
తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
