
అమెరికాలోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో 17 ఏళ్ల నికితా కాసాప్ అనే కుర్రాడు ఈ ఏడాది ఫిబ్రవరి 28నలో తల్లి టటియానా కాసాప్ (35), స్టెప్ ఫాదర్ డోనాల్డ్ మేయర్ (51)ను హత్య చేశాడు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను తుపాకీతో కాల్చి చంపాడు. అయితే మేయర్ జాబ్‌కు హాజరు కాకపోవడం, కాసాప్ దాదాపు 2 వారాల పాటు స్కూల్‌కు వెళ్లకపోవడంతో తనిఖీ కోసం వచ్చిన అధికారులకు ఇంట్లో తల్లిదండ్రుల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. హత్య అనంతరం 14 వేల డాలర్ల నగదు, పాస్‌పోర్ట్‌లు, ఇంట్లోని పెంపుడు కుక్కతో కుమారుడు నికితా కాసాప్ పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. గత నెలలో అతన్ని కాన్సాస్‌లో అరెస్టు చేశారు.
తల్లిదండ్రులను హత్య చేసిన యువకుడు కాపాస్ను పోలీసులు ప్రశ్నించగా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి, అతడి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి డబ్బులు కావాలని తల్లిదండ్రులను అడిగానని, వారు ఇచ్చేందుకు నిరాకరించడంతో హత్య చేశానని తెలిపాడు. ఈ మేరకు పేర్కొంటూ వారు ఫెడరల్ వారెంట్ జారీ చేశారు. ఒక మిలియన్ డాలర్ల బాండ్‌పై వౌకేషా కౌంటీ జైలులో కాసాప్ను నిర్బంధంలో ఉంచారు. వచ్చే నెలలో కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో శుక్రవారం విడుదల చేసిన FBI వారెంట్‌లో వివరాలను కౌంటీ ప్రాసిక్యూటర్లు మీడియాకు తెలిపారు.
కాసాప్.. ట్రంప్ హత్యకు ప్లాన్ కూడా వేశాడు. ఇందులో భాగంగా డ్రోన్ పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడు. రష్యన్ వ్యక్తితో సహా పలువురితో తన ప్లాన్‌ను కూడా చెప్పినట్లు ఫెడరల్ అధికారులు ఆరోపిస్తున్నారు. అడాల్ఫ్ హిట్లర్‌ను ప్రశంసిస్తూ మూడు పేజీల యాంటీ సెమిటిక్ మ్యానిఫెస్టోలో తన ప్లాన్ వివరాలు, తన ఉద్దేశాలు మొత్తం రాసినట్లు తెలిపారు. కాసాప్ మ్యానిఫెస్టోలో ట్రంప్‌ను చంపాలనుకునే కారణాలతోపాటు ఉక్రెయిన్‌కి వెళ్లాక అక్కడ ఎలా జీవించాలోకూడా ముందే ప్లాన్ చేసినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. మిల్వాకీలోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన వారెంట్‌లో టిక్‌టాక్, టెలిగ్రామ్ మెసెంజర్ యాప్‌పై కాపాస్ కమ్యూనికేషన్ వివరాలు కూడా పొందుపరిచారు. అధ్యక్షుడు ట్రంప్‌ను చంపి అమెరికా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే తన ప్రణాళిక గురించి ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపినట్లు సెర్చ్ వారెంట్ పేర్కొంది. ట్రంప్ హత్యకు అవసరమైన డబ్బుకోసం తల్లిదండ్రులతో గొడవపడి వారిని చంపినట్లు వెల్లడించింది. రష్యన్ మాట్లాడే వ్యక్తితో కాపాస్ సంప్రదింపులు జరుపుతున్నాడని, ఉక్రెయిన్‌కు పారిపోవడానికి ప్రణాళికను రూపొందించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కాపాస్ వద్ద ఉన్న డబ్బు, పాస్‌పోర్ట్‌లు, కారు, కుక్క ఉన్నట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
కాసాప్ తరపు పబ్లిక్ డిఫెండర్ నికోల్ ఓస్ట్రోవ్స్కీ గత నెలలో కోర్టులో.. తన క్లయింట్‌పై ఉన్న దొంగతనంతో సహా మిగిలిన అభియోగాలను కొట్టివేయాలని కోరింది. ప్రాసిక్యూటర్లు తమ కేసును దాఖలు చేయలేదని వాదించింది. కోర్టు విచారణల సమయంలో ఆమె తన క్లయింట్ వయస్సును కూడా ఉటంకించింది. కాసాప్ చిన్నవాడని, హైస్కూల్ విద్యకూడా పూర్తి చేయలేదని వాదించింది. కౌంటీ అధికారులు హత్య, శవాలను దాచిపెట్టడం, దొంగతనం చేయడం, డబ్బు పొందడానికి గుర్తింపు కార్డును దుర్వినియోగం చేయడం వంటి అభియోగాలు కాసాప్‌పై మోపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.