పులి తిరిగే ప్రాంతంలో మూత్రం, చెట్లపై గోకడం ద్వారా తమ గుర్తుల్ని విడిచిపెడతాయి. జింకలు, అడవిపందులు పశువులను ఆహారంగా తీసుకుంటాయి.అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాల ద్వారా పులుల కదిలికల పర్యవేక్షిస్తారు. పగ్మార్క్ ట్రాకింగ్, డీఎన్ఏ నమూనాల ద్వారా పులుల సంఖ్యను లెక్కిస్తారు. దుధ్వా పులుల అభయారణ్యంలో తాజాగా ఆదివారం సఫారీ యాత్రలో ఉన్న పర్యాటకులు కొండచిలువను నోటకరుచుకొని పోతున్న పులిని దగ్గరగా చూసి షాకయ్యారు. ఏడు అడుగుల కొండచిలువ పులి కోరల నుంచి తప్పించుకునేందుకు విలవిలలాడింది. కొండచిలువ బరువును మోయలేక పులి అతికష్టమ్మీద నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. పర్యాటకులు తమ మొబైల్ కెమెరాలతో ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. పులి సాధారణంగా జింకలు, అడవి పందుల వంటి జంతువులను వేటాడుతుందని.. కొండచిలువను వేటాడటం అరుదని దుధ్వా పులుల అభయారణ్యం డిప్యూటీ డైరెక్టర్ ఆర్.జగదీశ్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం
ఇరాన్లో నిరసన కారులను అణచివేస్తున్న ప్రభుత్వం వీడియో
అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో
నా మనవడికి భోగి పళ్లు పోస్తున్నాం వీడియో
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
