
సూరత్ నుంచి కోల్‌కతా వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు విమానంలో బీడీ తాగుతూ సిబ్బందికి పట్టుబడ్డాడు. మార్చి 27 సాయంత్రం ఈ ఘటన జరిగింది. సూరత్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టేకాఫ్ ఆలస్యమైంది. దాంతో ప్రయాణికులు ఫ్లైట్‌లోనే వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో విమానం వాష్‌రూమ్ నుంచి పొగ, వాసన రావడాన్ని గమనించిన సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే తనిఖీ చేయగా.. బెంగాల్‌కు చెందిన అశోక్ బిశ్వాస్ అనే వ్యక్తి బ్యాగ్‌లో బీడీలు, అగ్గిపెట్టె దొరికాయి. అతడే వాష్‌రూమ్‌లో బీడీ తాగినట్లు నిర్ధారించుకున్న అధికారులు బిశ్వాస్‌ను విమానం నుంచి దింపేయడంతో పాటు పోలీసులకు అప్పగించారు. సెక్యూరిటీ అధికారుల కళ్లుగప్పి నిషేధిత వస్తువులను విమానంలోకి ఎలా తీసుకెళ్లాడన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పాక్ జైలులో భారత మత్స్యకారుడు ఆ*త్మ*హత్య వీడియో
అమెజాన్‌కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు వీడియో
ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్ హత్య బెదిరింపులపై సల్మాన్ వీడియో
చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో