
బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉన్న కార్పొరేట్ ఉద్యోగాలకు ఇదో సువర్ణావకాశం. దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి, క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు TV9 నెట్వర్క్ మరో సరికొత్త ప్రోగ్రాంతో మన ముందుకు వచ్చేసింది. గతంలో TV9 కార్పొరేట్ ఫుట్‌బాల్ కప్ నిర్వహించగా.. ఇప్పుడు TV9 నెట్వర్క్ నేతృత్వంలో న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరగనుంది. టీవీ9 నెట్వర్క్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ సహకారంతో ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరగనుంది. క్రీడా సంస్కృతి, కార్పొరేట్ నెట్వర్కింగ్, ఫిట్నెస్, ఆరోగ్యకరమైన పని జీవితాన్ని ప్రోత్సహించడానికి ఇది సరైన వేదికగా నిలుస్తుందని టీవీ9 నెట్వర్క్ భావిస్తోంది.
న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ మే 9-మే11 వరకు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతుంది. ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగంలో 3 నుంచి 5 మంది ఆటగాళ్లతో కూడిన ప్రతి జట్టుకు పురుషుల సింగిల్స్ రెండు మ్యాచ్‌లు, పురుషుల డబుల్స్ ఒక మ్యాచ్ ఉంటుంది. అలాగే ఓపెన్ కేటగిరీలో కూడా ఒక మ్యాచ్ ఉంది. ఇక ఉమెన్స్‌కు కూడా సింగిల్స్ మ్యాచ్‌లు రెండు.. మిక్స్డ్ డబుల్స్ ఒక మ్యాచ్ ఉంటుంది. మరోవైపు ఈ ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన వారికి ట్రోఫీతో పాటు రూ. 6 లక్షల వరకు నగదు బహుమతి అందిస్తారు. అదనంగా, విజేతలకు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో రెండు రోజుల శిక్షణ ఇవ్వబడుతుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత.?
హైదరాబాద్‌తో నగరానికి చుట్టుప్రక్కల ఉన్న కార్పొరేట్ ఉద్యోగులు ఈ ఛాంపియన్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పాల్గొనే ప్రతి కార్పొరేట్ ఉద్యోగికి రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయి. అలాగే వేరే రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు దీనికి దరఖాస్తు చేసుకుంటే.. ఆయా ఉద్యోగులకు వసతి సౌకర్యం ఉంటుంది. వారు రూ. 7,500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఇక లోకల్ ఉద్యోగులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 2,500 చెల్లించాలి. న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఈవెంట్ పూర్తి వివరాల కోసం www.news9corporatecup.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.