
ఈక్రమంలో కొద్దిసేపటికి వల చాలా బరువెక్కింది. మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వలలో భారీగానే చేపలు చిక్కి ఉంటాయని ఆశతో వలను పైకి లాగారు. వలలో చిక్కింది చూసిన వారి గుండె గుబేల్మంది. వలలో భారీ కొండచిలువ చిక్కింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో వేగూరు కాలువలో గిరిజన మత్స్యకారుల చేపల వలకు భారీ కొండచిలువ చిక్కడంతో ఒకింత ఉలిక్కిపడ్డారు మత్స్యకారులు. దాదాపు 15అడుగుల పొడవున్న భారీ కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. చేసేది లేక ఆ కొండచిలువను పైకి లాగారు. ఒడ్డుకు తీసుకొచ్చి, వలలోనే ఉంచి, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండచిలువను తీసుకెళ్లి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి