
యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
2023లో విడుదలైన అమిగోస్ చిత్రం ద్వారా ఈ బ్యూటీ వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ చిన్నదానికి మాత్రం మంచి ఫేమ్ వచ్చింది. తర్వాత నాగార్జున నా సామిరంగ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
అయితే ఆషికా దురదృష్టమో లేక అదృష్టమో కానీ ఈ బ్యూటీ చేసిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా ఈ ముద్దుగుమ్మ మాత్రం తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకొని, యూత్ క్రష్‌గా మారిపోయింది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, సమ్మర్ వేడిని తగ్గిస్తూ.. చేతిలో కొబ్బరి బోడం పట్టుకొని, తన చిలిపితనంతో అల్లరి చేస్తూ.. పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఆషికా రంగనాథ్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ బ్యూటీ విశ్వంభర మూవీలో కీలక పాత్రలో చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమాకి హీరోయిన్గా ఓకే అయినట్లు నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు.