
తెలంగాణలో నడిరోడ్డుపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలోని కరుణగిరి బైపాస్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. భయాందోళనకు గురైన వాహనదారులు, కాసేపు రాకపోకలు నిలిపివేశారు. ప్రధాన రహదారి కావడంతో రోడ్డు దాటుతున్న కొండచిలువను చూసిన స్థానిక ప్రజలు షాక్కు గురయ్యారు. వాహనాలు ఎక్కడికక్కడే తమ వాహనాలను నిలిపివేసారు.. పాదచారులు భయ బ్రాంతులకు గురయ్యారు. రోడ్డుకు అడ్డంగా పాకుతూ వెళ్తున్న పైథాన్ అందరినీ హడలెత్తించింది.
వీడియో ఇక్కడ చూడిండి..
ఎట్టకేలకు ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా నెమ్మదిగా రోడ్డు దాటిన కొండచిలువ అక్కడ్నుంచి చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయింది. దీంతో వాహన దారులు, పాదచారులు ఊపిరి పీల్చు కున్నారు. కొండ చిలువ రోడ్డు దాటుతుండగా కొందరు తమ సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. ఇప్పుడా వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..