
ఇలా అప్పుడప్పుడు కొన్ని నిమిషాలు గంటలు ట్రాఫిక్ లో చిక్కుకుంటేనే మనకు ఇలా అనిపిస్తుంది. మరి 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగితే..? అందులో చిక్కుకున్న వారు ఎటూ వెళ్లలేక కార్లలోనే ఉండిపోవాల్సి వస్తే..? ఊహించుకునేందుకే భయంగా ఉంది కదా.? కానీ 15 ఏళ్ల క్రితం చైనా ప్రజలు అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జాంలో చిక్కుకుని నరకం చూశారు. చైనా.. ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో ఉన్న ఈ దేశంలో వాహనాల సంఖ్య కూడా ఎక్కువ. అక్కడి రోడ్లన్నీ నిత్యం రద్దీగానే ఉంటాయి. అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ తో జనం ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కానీ చైనా రాజధాని బీజింగ్ ప్రజలు ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ట్రాఫిక్ జామ్ ఎదుర్కొన్నారు. దాదాపు 100 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ ట్రాఫిక్ జామ్ సమయంలో చైనా నేషనల్ హైవే 110పై లక్షలాది వాహనాలు నిలిచిపోయాయి. కనుచూపుమేరలో బస్సులు, కార్లు, వాహనాలు మాత్రమే కనిపించాయి. 2010 ఆగస్ట్ 14. బీజింగ్-టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 12 రోజుల పాటు వాహనాల్లోనే చిక్కుకుపోయిన జనం.. వాటిలోనే తిని, తాగి, పడుకోవాల్సి వచ్చింది. మంగోలియా నుంచి బీజింగ్‌కు బొగ్గు, నిర్మాణ సామగ్రిని తీసుకెళ్తున్న ట్రక్కుల కారణంగా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలో బీజింగ్ – టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం జరుగుతోంది. ఆ పనుల కారణంగా రోడ్డును వన్ వేగా మార్చారు. ఇదికాస్తా పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. మంగోలియా నుంచి బీజింగ్ కు వెళ్తున్న ట్రక్కులన్నీ ఒకేసారి ఈ రోడ్డెక్కడం వాటిలో కొన్నింటికి రిపేర్ రావడంతో ట్రాఫిక్ స్తంభించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగలకు కూడా లక్షల్లో వేతనం.. వారు చేసే పని తెలిస్తే మైండ్ బ్లాంక్
హాట్ ఎయిర్ బెలూన్ తో పై కెళ్లిన వ్యక్తి.. తెగి పడ్డ తాడు.. ఏం జరిగిందంటే..
వామ్మో ..! నీళ్ల బాటిల్ ధర రూ. 50 లక్షలా?
Samantha: రెండో పెళ్లికి సమంత రెడీ.. మేలో ముహూర్తం?
QR కోడ్ స్కాన్ చేస్తున్నారా ?? మీ బ్యాంక్ ఖాతా జాగ్రత్త!