
అయితే ఆ కుక్క తొమ్మిదేళ్ల వయసులో ప్రాణాంతక సార్కోమా క్యాన్సర్ బారిన పడింది. ఆ సమయంలోనూ జు తన కుక్కను కంటిపాపలా చూసుకుంది. దానికి అనస్థీషియా లేకుండానే విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించి మరీ రక్షించుకుంది. అయితే ఆ తర్వాత ఆ కుక్క పలు వ్యాధుల బారినపడటం మొదలైంది. అయినా తన శక్తిమేర దాని బాగోగులు చూసుకుంటూనే వచ్చింది. కానీ ఆ కుక్క 2022లో గుండెపోటుతో అనూహ్యంగా మరణించింది. దీంతో పెంపుడు కుక్క పోయిందన్న దిగులుతో గడపటం మొదలుపెట్టింది జూ. అలా ఆ కుక్క మరణం జూపై తీవ్ర ప్రభావం చూపింది. నిద్రలేని రాత్రులు గడిపేది. ఇక ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించటం మొదలైంది. ఇక లాభం లేదు ఇలా దుఃఖంలో మునిగిపోవడమే తప్ప బయటకి రాలేనని గ్రహించింది జు. దీనికి సరైన పరిష్కారం కనుగొని ఇదివరకటిలా హాయిగా జీవితాన్ని గడపాలనుకుంది. అందుకోసం బాగా ఆలోచించి.. క్లోనింగ్ ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యింది. క్లోనింగ్ ప్రక్రియతో జీవిని పోలిని జీవిని సృష్టిస్తారు శాస్త్రవేత్తలు. ఇదే తన బాధకు చక్కటి ఉపశమనం అని నమ్మి.. క్లోనింగ్ సౌకర్యాన్ని అందించే ఆస్పత్రిని సందర్శించి ఏకంగా రూ. 19 లక్షలు చెల్లించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలర్ట్.. ఇకపై ఈ రైళ్లు కూడా చర్లపల్లి నుంచే..
ఉరుములకు భయపడిన ఉడుత.. ఏం చేసిందంటే..
బెట్టింగ్ ఎఫెక్ట్! యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్
దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?
పవన్ కళ్యాణ్ పై బంగారం హీరోయిన్ క్రేజీ ట్వీట్