
వెస్ట్ బెంగాల్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని ప్రతిమా మండలం ధోలాఘాట్ గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సెఫ్టీ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఇవి కూడా చదవండి
STORY | 7 people, including 4 children, killed in gas cylinder blast in Bengal
READ: https://t.co/9t9uCOSzy8
VIDEO |
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/dv5TRAShcC) pic.twitter.com/f9rFioqQIh
— Press Trust of India (@PTI_News) March 31, 2025
వీడియో ఇక్కడ చూడండి..
కానీ, అప్పటికే తీవ్ర నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఇంట్లో బాణా సంచా ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
South 24 Parganas, West Bengal: A powerful explosion occurred while making firecrackers in Patharpratima under, Dholaahat police station limits, resulting in the death of two people and leaving several others seriously injured pic.twitter.com/AjVoNOt6dS
— IANS (@ians_india) March 31, 2025
ఇంట్లోని రెండు సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. ఇంట్లో ఎప్పటి నుంచో బాణాసంచా నిల్వ ఉందని.. దానికి మంటలు అంటుకుని పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..