
సినీరంగంలో హీరోయిన్ కీర్తి సురేష్ కు మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడి అందానికి అభినయానికి అందరూ ఫిదా అవ్వాల్సిందే.
తెలుగులో మహానటి సినిమాతో ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరూ సినీరంగానికి చెందినవారే.
ఆమె తండ్రి ప్రముఖ నిర్మాత కాగా.. తల్లి ఒకప్పటి నటి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి.. మలయాళంలో మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా మారింది.
తెలుగులో రామ్ పోతినేని సరసన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కీర్తి.. ఇటీవలే పెళ్లి చేసుకుంది.
పెళ్ళికారణంగా సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన ఈ చిన్నది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారనుంది. అంతే కాదు పెళ్లి తర్వాత వరుస ఫోటో షూట్స్ తో మతిపోగొడుతోంది. తాజాగా కొన్ని గ్లామరస్ ఫోటోలు వదిలింది ఈ చిన్నది.