
ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ సైతం ఏలియన్స్ ఉన్నారని, అయితే వారి సందేశానికి స్పందించడం కూడా చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. అయినా మనిషి ఎన్నో ఏళ్లుగా గ్రహాంతరవాసుల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు. ఏలియన్స్తో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంతకీ గ్రహాంతరవాసులు ఉన్నారా..? ఉంటే ఎక్కడున్నారు..? ఎలా ఉంటారు..? అనంతమైన విశ్వంలో లెక్కకు మించిన గ్రహాలు ఉన్నాయి. అందులో భూమి కూడా ఒకటి. భూగోళం మాదిరిగానే ఇతర గ్రహాలపైనా జీవరాశి ఉందని.. అక్కడ జీవించేందుకు అవకాశం ఉందన్నది దశాబ్దాలుగా కొందరు సైటింస్టుల వాదన. విశ్వంలో మనకన్నా ఎన్నో రెట్లు తెలివైన జీవులు ఉన్నాయని, అవే ఏలియన్స్ అని అంటున్నారు. మోడ్రన్ టెక్నాలజీని వాడటంలో గ్రహాంతరవాసులు మనుషుల కన్నా ఎన్నో రెట్లు ముందున్నారన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే ఏలియన్స్ ఉనికికి సంబంధించి ఇప్పటి వరకు కచ్చితమైన ఆధారాలు లభించకపోయినా సైంటిస్టులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గ్రహాంతరవాసుల జాడ తెలుసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇతర గ్రహాలపై జీవించేందుకు అనువైన వాతావరణం ఉందా లేదా.. అనే ప్రయోగాలు కొనసాగిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..
పనస తొనలు ఆరోగ్యమే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం
రష్మికతోనే కాదు.. ఆమెకు పుట్టబోయే కూతురితో కూడా నటిస్తా..
తుది తీర్పు !! సుశాంత్ మరణానికి జస్టిస్ ఇదేనా ??
కన్నప్ప ట్రోల్ చేసిన వారికి.. ఆ శివయ్య శాపం తగులుతుంది