మైదానంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల భారీ మెగా బతుకమ్మ ఒక గిన్నిస్ రికార్డును సాధించగా, దాని చుట్టూ 10,000 మంది మహిళలు లయబద్ధంగా బతుకమాడి మరో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. తీరొక్క పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మ చుట్టూ ఉయ్యాలా పాటలకు నృత్యాలు చేస్తూ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ అద్భుతమైన వేడుకను గిన్నిస్ బుక్ ప్రతినిధులు నమోదు చేసి ఫలితాలను ప్రకటించారు. ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మ పండుగకు లభించిన ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయంగా చాటింది. ఈ వేడుకలో మంత్రులు సీతక్క, జూపలి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన CM రేవంత్
Gold Price: నేను తగ్గను కాక తగ్గను అంటున్న బంగారం
దసరా ఉత్సవాల్లో ‘పుత్తడి అమ్మ’ ఆల్ టైమ్ రికార్డులు
Hyderabadలో ప్రపంచ ముద్దుగుమ్మల సందడి అనాధ పిల్లల సేవలో సుందరాంగులు
ప్రసాద్ ల్యాబ్లో OG స్పెషల్ షో కుటుంబంతో కలిసి చూసిన పవన్
