
గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన మాట ప్రకారం గద్దర్ అవార్డులకు గాను జీ.ఓ ఎం.ఎస్ నెంబర్ 25 జీ,ఓ. (ఐ అండ్ పీఆర్) తేదీ.11.3.2025 ను నేడు విడుదల చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలనందించిన పైడి జయరాజ్, కాంతా రావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని, ఇప్పటికే, ప్రముఖ నటులు ఎం. ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలన చిత్రానికి అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2014 నుండి 2023 వరకు అప్పటి తెలంగాణా ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను జారీ చేయక పోవడంతో, ఆ సంవత్సరాలకు కూడా ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలన చిత్రానికి అవార్డు నివ్వాలని నిర్ణయించారు. ఫీచర్ ఫిలిం కాటగిరిలో మొట్టమొదటి సారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణ యించింది.
గద్దర్ చలన చిత్ర అవార్డులకు సంబందించిన దరఖాస్తులు ఏ.సి గార్డ్స్ లోని తెలంగాణా చలన చిత్ర పరిశ్రమాభివృద్ది సంస్థ కార్యాలయంలో తేదీ.13 .3 .2025 నుండి దరకాస్తులు అందుబాటులో ఉంటాయి. ఈ గద్దర్ అవార్డులను ఈ క్రింది కాటగిరీలలో ఇవ్వడం జరుగుతుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.