కోనసీమలో ప్రసిద్ధి చెందిన ప్రభల తీర్థం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సాంప్రదాయ ఉత్సవం ప్రతి సంవత్సరం కనుమ రోజున, అంటే సంక్రాంతి మరునాడు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు కోనసీమలోని 160 గ్రామాల నుండి భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ సంవత్సరం జగ్గన్నతోట ప్రభల తీర్థానికి ఒక విశిష్ట గుర్తింపు లభించింది. 476 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన జగ్గన్నతోట ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. 17వ శతాబ్దంలో పెద్దాపురం సంస్థానాధీశులైన వత్సవాయి జగన్నాథ మహారాజు ఈ వేడుకను ప్రారంభించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
