
కొలంబియా వెనక్కి తగ్గి స్వదేశానికి తిరిగి వచ్చిన పౌరులను ఆహ్వానించడంతో… తాము ఆ దేశంపై విధించిన సుంకాలు, పలు ఆంక్షలను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ‘‘అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూఎస్‌లో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న తమ పౌరులను వెనక్కి పిలిపించుకోవడానికి ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకొని తనకు సహకరించాలని’ అని వైట్‌హౌస్ పేర్కొంది. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారివారి స్వదేశాలకు పంపడానికి అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరుపై పలు దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇలా వలసదారులను తీసుకొచ్చే విమానాలను తమ దేశంలోకి అనుమతించబోమని కొలంబియా తేల్చి చెప్పింది. ‘‘కొలంబియా వలసదారులను తీసుకువచ్చే అమెరికా విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నామని’ అని ఆ దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రో ఇటీవలే చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుంభమేళా చుట్టూ చిట్టడవి.. స్వచ్ఛమైన గాలికి కొదవే లేదు..
శివ శంకర్‌గా మారిన సద్దాం హుసేన్.. ప్రియురాలి కోసం హిందువుగా
అక్షయ్ సినిమాపై వివాదం భగ్గుమంటున్న ఆ వర్గం