ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ స్విట్జర్లాండ్లో పెను విషాదం చోటుచేసుకుంది. లగ్జరీ ఆల్పైన్ స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్ మోంటానా లోని ఒక బార్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారని స్విస్ పోలీసులు తెలిపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లే కాన్ట్సెలేషన్ అనే బార్లో గురువారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్నదానిపై క్లారిటీ లేదు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్విస్ ఆల్ప్స్ పర్వతశ్రేణుల నడుమ ఉన్న ఈ క్రాన్స్ మోంటానా నగరం ప్రముఖ పర్యాటక స్థలం. ఏటా డిసెంబరు-జనవరి సమయంలో ఇక్కడ పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?
Teja Sajja: నేను విన్నాను.. నేనున్నాను అంటున్న హీరో
Nayanthara: నయనతారకు మాత్రమే అదెలా సాధ్యం..?
కమ్ బ్యాక్ ఇవ్వాలమ్మా.. లేకపోతే చాలా కష్టం
2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు
